ఏలూరు, జూలై 21: ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారిగా (డీఆర్ఓ) బాధ్యతలు స్వీకరించిన ఎం. శ్రీదేవి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆమె పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు జిల్లాలో కృష్ణపట్నం-హైదరాబాద్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీదేవికి పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఏలూరు డీఆర్ఓగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.