
ఎలమంచిలి పట్టణంలోని సబ్‌జైల్‌ను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముద్దాయిల సమస్యలను, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఉచిత న్యాయ సహాయం అవసరమైతే ప్రభుత్వ వకీలను కేటాయించి బేలు పెట్టిస్తామని కార్యదర్శి తెలిపారు.
జైల్లో ఆరోగ్య సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు ఉంటే వాటిని వివరంగా చెప్పాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సబ్‌జైల్ సూపరింటెండెంట్ కిరణ్, ప్యానల్ లాయర్స్ పి.వి. రమణ, టి. నూకరాజు, బి. హరి శంకర్, అలాగే కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
జైల్లో ఉన్న ముద్దాయిలకు న్యాయ సహాయం అందించడం, వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణకు న్యాయ సేవా సంస్థ కృషి చేస్తోంది.