ఎలమంచిలి మండలంలోని వ్యవసాయ శాఖ వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడినటువంటి పొలం పిలుస్తుంది కార్యక్రమం ఖరీఫ్ 2026వ సంవత్సరంలో రైతులకు చేదోడు వాదోడుగా రైతుల పొలాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఈరోజు ఏటికొప్పాక ,బయ్యవరం గ్రామాలలో వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి మండల వ్యవసాయ అధికారి మోహనరావు మాట్లాడుతూ రైతు సోదరులందరూ ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తక్కువ మద్యస్థ మరియు ఎక్కువ పంటకాల పరిమితి రకాలైనటువంటి విత్తనాలు అన్ని రకాల వరి విత్తనములు వ్యవసాయ శాఖ మరియు రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని, రైతు సోదరులను నారుమడుల విషయాలలో మేలుకవులు పాటిస్తే నారు సమృద్ధిగా పెరిగి ఎటువంటి చీడపీడలు నారుమడులలో లేకుండా గమనించినట్లయితే ప్రధాన వరి పొలంలో ఒక చదరపు మీటరుకు 33 మొక్కలు ఉండేలాగా సరిచూసుకోవాలని ఆ విధంగా వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని అలాగే ఎరువుల విషయంలో ముఖ్యంగా యూరియా కొరత లేదని రైతు సేవా కేంద్రాలతో పాటుగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లక్కవరం మరియు డీలర్ల వద్ద 124 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని ,రైతు సోదరులు తమరు యొక్క ఆధార్ నెంబర్ ను ఉపయోగించి ఏపీ ఎఐఎంఎస్ యాప్ ద్వారా ఎరువులు వినియోగించుకొని తద్వారా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు యూరియా విషయంలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మండల వ్యవసాయ అధికారి వారిని 8331056391 సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రైతులు సూర్యారావు పెంటయ్య నానాజీ తో పాటుగా APCNF స్టాఫ్,గ్రామ సహాయకులు మధు మరియు కుమార్ పాల్గొన్నారు