
అనకాపల్లి పట్టణంలో మెకానిక్ డే సందర్భంగా రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ రోజు హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ర్యాలీలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. వెంకట నారాయణ, సబ్-ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, మెకానిక్ సంఘ సభ్యులు, ద్విచక్ర వాహనదారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ప్రజలు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. వెంకట నారాయణ మాట్లాడుతూ: “హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుడి బాధ్యత. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా లక్ష్యం” అని అన్నారు.