పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి  సిఐటియు

పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి సిఐటియు

25/February/2026 06:49    Share:   

యలమంచిలి : పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము డిమాండ్ చేశారు. యలమంచిలి డీసీసీబీ బ్రాంచ్ వద్ద పీఏసీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, రైతు సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, కోండకర్ల సోసైటీ అధ్యక్షులు గొంతిన భక్త సాయి రామ్ లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా విశాఖ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు రాయవరపు శివరామకృష్ణ  మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా రైతులకు ప్రాథమిక స్థాయిలో ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా సహకార ఉద్యోగులకు సేవలు అందించారని అన్నారు. 2019మార్చిలో జీవో నెంబర్ 36 విడుదల చేయడం చేసినా నేటికి ప్రభుత్వాలు సదర జీవో ను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని తెలిపారు. అయితే దేవుడు వరమిచ్చిన పూజారి వరము ఇవ్వని చందంగా అధికారులు జీవో ను అమలుచేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. జీవో నెంబర్ 36ను, లాభనష్టాలతో సంబంధం లేకుండా పిఎసిఎస్ ఉద్యోగులకు తక్షణమే అమలు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కోరారు. 36 జీవోలో పేర్కొన్న విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ ఫండ్ ఆప్కాబ్, డిసిసిబి వారు రిలీజ్ చేయాలని, 2019 సంవత్సరం తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరును పర్మినెంట్ చేయాలని, పదవి విరమణ వయసు 62 సంవత్సరంలకు పెంచాలని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రాడ్యుటీ సహకారు ఉద్యోగులకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. గ్రాడ్యుటి చట్టప్రకారం అమలు చేయాలని, ఉద్యోగులకు టర్మ్ ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయలు చేయాలని, డివిడెంట్ రైతులకు తక్షణమే రిలీజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ ప్రధాన కార్యదర్శి గొంప రమణ, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మద్దల లోవ రాజు, పి నాగభూషణం, కే శ్రీనివాస్, వై ప్రసాద్, ఎం ఎల్ నాయుడు, సుంకర రవి, రాజన్న శంకర్రావు వీరితో పాటుగా యలమంచిలి, నక్కపల్లి, అచ్యుతాపురం, అడ్డరోడ్డు, పాయకరావుపేట, కోటవురట్ల పరిధిలో గల అన్ని పిఎసిఎస్ బ్రాంచ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter