ఎలమంచిలి:
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు రామారాయుడుపాలెం గ్రామంలో శనివారం (నేడు) ఎలమంచిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ సహకారంతో రైతులకు ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 45 పశువులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి,అవసరమైన మందులను పంపిణీ చేశారు. అలాగే గొర్రెలు, మేకలకు ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు (ఇంజక్షన్లు) వేశారు.
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ టి. లవకుమారి, వైస్ చైర్మన్ గొర్లె బాబురావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా, పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎలమంచిలి టౌన్ పార్టీ అధ్యక్షులు గొర్లె నానాజీ, ఆడారి ఆదిమూర్తి, ఆడారి రమణబాబు,నీటి సంఘం చైర్మన్ దాడి చంద్రశేఖర్, 13వ వార్డు అధ్యక్షులు కరెడ్ల మల్లికార్జున రావు పాల్గొన్నారు. కూటమి నేతలు జనసేన పార్టీ నుండి బెజవాడ మణిబాబు, తుమ్మలపూడి శ్రీనివాసరావు, ఇరిగిల శ్రీనివాసరావు, బిజెపి నుండి అడ్డాల వెంకట గణేష్, గొర్లె మురళి మోహన్ రావు, అంకిరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.