పేదలకు అండగా కూటమి ప్రభుత్వం..

పేదలకు అండగా కూటమి ప్రభుత్వం..

03/August/2026 18:45    Share:   

ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్     మరియు ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు మరియు మాజీ ఎంపీ అప్పల చలపతిరావు గారు హయాంలో టౌన్ ప్రెసిడెంట్ నానాజీ గారి అధ్యక్షతన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 
ఇందులో భాగంగా శ్రీ ప్రగతి నాగేశ్వరావు ముందుగా మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేదలకు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి 'ముఖ్యమంత్రి సహాయ నిధి' (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న వేలాది దరఖాస్తులను ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తూ నిధులను విడుదల చేస్తోంది. మరియు అనారోగ్యం పాలై, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు వెచ్చించి వైద్యం చేయించుకోలేని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ సంజీవనిలా మారుతోంది. ఆపదలో ఉన్న ప్రతి ప్రాణాన్ని కాపాడటమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి.. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత సులభతరం చేసి, వేగవంతం చేశారు. దీంతో లబ్ధిదారులకు సకాలంలో సాయం అందుతుందని. తెలిపారు. నియోజకవర్గంలో 28 మందికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 14 లక్షల 50 వేల రూపాయలు చెక్కుల  రూపాయల అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అచ్చుతాపురం మండల పార్టీ అధ్యక్షులు  పీలా తులసిరాం, మునగపాక పార్టీ ప్రెసిడెంట్ పెంటకోట విజయ్ గారు, మోటూరు పాలెం ఎంపీటీసీ నీరుకొండ నర్సింగరావు, జిల్లా అధికార ప్రతినిధి దాడి రమేష్, క్లస్టర్ యూనిట్, నాయకులు కార్యకర్తలు సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter