మార్చి 10 నుంచి నవరాత్రుల దీక్షలు ప్రారంభం భక్తజనకోటి ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న అనకాపల్లి గవరపాలెం లో వెలసిన శ్రీ నూకంబికా అమ్మవారి నవరాత్రుల దీక్షలువచ్చే మార్చి నెల 10 వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు శ్రీ నూకాంబిక అమ్మవారి మాల ధారణ భక్త బృందం గురుస్వామి పొలిమేర శ్రీనివాసరావు తెలిపారు. అమ్మవారి కొత్త అమావాస్య జాతర పురస్కరించుకొని ప్రతి ఏటా చుట్టుపక్కల ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారి మాల ధరించి భక్తిశ్రద్ధలతో దీక్ష చేస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మాల ధారణ భక్తులు ఉదయం సాయంత్రం పూజలు చేసుకునేందుకు ప్రటిష్టమైన ఏర్పాట్లు చేశారు.అదేవిధంగా మార్చి నెల 14 వ తేదీ శనివారం భారీ అన్న సమారాధన మరియు సాయంత్రం 4 గంటల నుంచి అనకాపల్లి పట్టణపురవీధుల గుండా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మేళతాళాలతో అమ్మవారి ఉత్సవమూర్తి తో భారీ ఊరేగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.