హరనామస్మరణతో మారుమోగిన భద్రాచలం

హరనామస్మరణతో మారుమోగిన భద్రాచలం

01/March/2026 07:34    Share:   

ప్రత్యేక ప్రతినిధి: పెంటకోట పూర్ణచంద్రరావు
హరనామస్మరణతో భద్రాచలం మారుమ్రోగింది.పవిత్ర పుణ్యక్షేత్రమైన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా భద్రాచలం లో
కొలువైన శ్రీరామచంద్రుని ఆలయ సమీపంలో గల శ్రీ కుసుమహరనాథ మందిరంలో నామ త్రయహ వేడుకలుఘనంగాజరిగాయి. 
ఈ సందర్భంగా ఫిబ్రవరి 20 వ తేదీ న ప్రారంభమైన ' జై హరనాథ - జై కుసుమ కుమారి జై" అను నామంతో మొదలైన త్రయహ వేడుకలు 23 వ తేదీ ఉదయం మంగళ హారతి తో ముగిసాయి. దువ్వాడ శ్రీ కుసుమ హరనాథ్ ఆశ్రమ నామ ప్రచారక్ సంఘం ఆధ్వర్యంలో ఆర్ వి ఎస్ రమేష్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో కే శేఖర్, కే మంగరాజు, బి .శివ సీతా రామ్ తదితరులు తమ సేవలు అందించారు. ఈ సందర్భంగా నిత్యం  ప్రత్యేక పూజలు విశేష అలంకరణలు చేశారు. మహిళల చే సామూహిక
 కుంకుమ పూజలు, కోలాటాలుజరిగాయి. ఆదివారం హరనాథ ప్రభులకు,మాత కుసుమ కుమారి లకు వేదపండితుల మంత్రోచ్ఛారణలతో,మంగళ వాయిద్యాలతో  కళ్యాణ వేడుకలు నిర్వహించారు.అనంతరం కల్యాణ విందు ఏర్పాటు చేశారు. దీనికి ముందు భద్రాచల సీతారామ ఆలయ పరిసరాల్లో పురవీధులగుండా కుసుమకుమారి- హరనాథ ప్రభువుల చిత్రపటాలతో భజన సంకీర్తనలు పాడుతూ నగర సంకీర్తన చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనకాపల్లి గుంటూరు, దువ్వాడ, యాతపాలెం, కేజే పురం తదితర ప్రాంతాల నుంచి సుమారు 200 మంది కి పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ వి ఎస్ రమేష్ మాట్లాడుతూ  7 వ సారి ఈ త్రయాహ వేడుకలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఈ ఏడాది 9 వ నెలలో 
ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ఒడిస్సా రాష్ట్రం పూరి లో కుసుమ హరనాథ్  నామ వేడుకలు నిర్వహించనున్నట్లు
 చెప్పారు.
Breaking News

Subscribe our Newsletter